2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కలిసి పోటీ చేస్తాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు.
“నేను దోషినే అయితే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? మీకు వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండి,” అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తనకు సమన్లు పంపడం ఒక గిరిజన ముఖ్యమంత్రిని వేధించే కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.
జార్ఖండ్‌లో ఇప్పటికే తీవ్ర రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొట్టుమిట్టాడుతుండగా.. ప్రస్తుతం అతని తమ్ముడి వల్ల మరో సమస్య మెడకు చుట్టుకుంది. ముఖ్యమంత్రి సోదరుడు, దుమ్కా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బసంత్ సోరెన్ తన నోటి దురుసు వల్ల వార్తల్లో నిలిచారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయాల్లో అస్థిరత నెలకొన్న సంగతి తెలిసిందే. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని హేమంత్ సోరెన్ ఆరోపించారు.