ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త వేరియంట్‌తో భయపడుతున్నది. ఎటు నుంచి దేశంలోకి ప్రవేశిస్తుందో తెలియక ఆందోళనలు చెందుతున్నారు. ఈ వేరియంట్ నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధిస్తే, ఇజ్రాయిల్ వంటి దేశాలు సరిహద్దులు మూసివేశాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే, చైనా మాత్రం తనకేమి తెలియదు అన్నట్టుగా బలప్రదర్శన చేస్తున్నది. Read: బ్రేకింగ్ : ఒమిక్రాన్‌పై సబ్ కమిటీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..…
తైవాన్ సరిహద్దుల్లో మళ్లీ రడగ మొదలైంది. చైనాకు చెందిన 30 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడ్డాయి. నెల రోజుల వ్యవధిలో 60సార్లు చైనా విమానాలు చొరబడినట్టు తైవాన్ పేర్కొన్నది. దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు తైవాన్ కుడా మిలటరీ ఆపరేషన్‌ను నిర్వహించింది. తైవాన్ యుద్ధ విమానాలు విన్యాసాలను ప్రదర్శించాయి. తైవాన్ పై చైనా ఆధిపత్యాన్ని సాగనివ్వబోమని మరోసారి తైవాన్ స్పష్టం చేసింది. తైవాన్ తమ భూభాగమే అని ఇప్పటికే చైనా ప్రకటిస్తూ వస్తున్నది. దానికి తైవాన్ అంగీకరించడం…