Samagra Kutumba Survey: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇకపోతే, ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488…
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మే 27న జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజున వారి ఓటు వేసేందుకు ప్రత్యేక క్యాజువల్ సెలవులు మంజూరు చేస్తూ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు,…
Five Peoples Test Positive for COVID-19 in Same Family: భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. Also Read: Road…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటెండర్‌తో బూట్లు మోయించారనే ఆరోపణలు కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్ 2023 సందర్భంగా స్థానిక చర్చిలో జరిగిన వేడుకలకు కలెక్టర్ భవేశ్ మిశ్రా బూట్లతోనే ప్రార్థన మందిరంలోకి వెళ్లారు. బూట్లతో ప్రార్థన మందిరంలోకి వెళ్లడం సరికాదని గ్రహించిన కలెక్టర్.. పక్కనే ఉన్న అటెండర్ దఫేదార్ చేతికి తన బూట్లను ఇచ్చారు. Also Read: Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి..…
Bhupalpally: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ గ్రామం జలమయమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత రాజకీయం నడుస్తోంది. పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలు, భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాలను కలుపుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్‌దే హవా. జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో జక్కు శ్రీహర్షిణి ఆ పదవి చేపట్టారు. ఎంతో హుషారుగా ఆ పదవిలో కూర్చున్నా.. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ఆమె ఉత్సహాన్ని ఆవిరి చేస్తున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా…