టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి జయప్రద చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజమండ్రిలో బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆమె తళుక్కుని మెరిశారు. రాజమండ్రి తన జన్మభూమి అయితే.. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని సభలో జయప్రద చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజమండ్రిలో పుట్టిన జయప్రద చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి వరకు…