కన్నడ నటి రన్యారావుతో తెగతెంపులు చేసుకునేందుకు ఆమె భర్త జతిన్ హుక్కేరి రెడీ అయ్యాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరికీ వివాహం అయింది. కానీ ఏనాడూ అతడితో సంసారం చేయలేదు. వ్యాపారాలు పేరుతో విదేశాలకు వెళ్తూ ఉండేదని.. ఒక్క నెల కూడా తనతో సరిగ్గా లేదని ఇటీవల విచారణ సందర్భంగా డీఆర్ఐ అధికారుల ముందు జతిన్ హుక్కేరి వాపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి అరెస్టు నుండి మినహాయింపు కోరాడు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అతనికి కర్ణాటక హైకోర్టు గత మంగళవారం ఉపశమనం ఇచ్చింది. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.