JAPANESE ENCEPHALITIS IN ASSAM: అస్సాం రాష్ట్రాన్ని వరసగా విపత్తులను ఎదుర్కొంటోంది. గతంలో వరదల కారణంగా అస్సాం అతలాకుతలం అయింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్(బ్రెయిన్ ఫీవర్) కలవరపెడుతోంది. అస్సాంలో ఈ వ్యాధితో బాధపడుతూ చాలా మంది మరణిస్తున్నారు. వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అస్సాంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి (Japanese Encephalitis) విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 35 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు.