జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు, ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం, కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో, మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయ్యింది. దీని కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని…
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ బుధవారంతో ముగుస్తోంది. కానీ ఇంతలోనే వాణిజ్య భాగస్వామ దేశాలైన జపాన్, దక్షిణ కొరియాపై భారీగా సుంకాలు విధించారు. ఆ రెండు దేశాలకు రాసిన లేఖల్లో జపాన్, దక్షిణ కొరియా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Elon Musk: అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా ఖండించారు. ధనిక దేశాలైన అమెరికా, జపాన్, ఇటలీలో జననాల సంఖ్య తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Low birth rate: ప్రపంచ వ్యాప్తం పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కుంటున్నాయి. ప్రతీ ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
Indian Economy: జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. మొత్తం ప్రపంచ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు.
జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఒసాకా ఎక్స్పో’లో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న…
ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కు బయల్దేరనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం సీఎం వెంట వెళ్లనున్నారు. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు తెలంగాణ ప్రతినిధుల బృందం జపాన్ లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమా లో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుంది. ఓసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆ…
జపాన్‌లో భూకంపం సంభవించింది. క్యుషులో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం సాయంత్రం 7:34 గంటలకు 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర జపాన్ వెర్షన్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జపాన్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ పెద్ద ఎత్తున జపాన్ మీడియాలో సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అయితే జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కి పోవడం ఖాయం. ఎందుకంటే ఆయనకు అభిమానులు జెండర్ తో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే ఆయన కోసం ఎగబడుతున్నారు. ఆటోగ్రాఫ్ లు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇవ్వమని కోరుతున్నారు.…
ప్రజంట్ జపాన్ లో తెలుగు చిత్రాలకు ఎంత డిమాండ్ ఉందో మనకు తెలిసిందే. కథను బట్టి అక్కడ కూడా మన సినిమాలు బ్లక్బాస్టర్ అవుతున్నాయి. ఇక తాజాగా తారక్ ‘దేవర’ పార్ట్ 1 ను జపనీస్ భాషలో డబ్బింగ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తో ఆల్రెడీ తన నటనతో జపాన్ ప్రేక్షకులో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘దేవర’ను సైతం అక్కడ విడుదల చేస్తున్నారు మెకర్స్. ఈ నెల 28న ఈ సినిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.…