మనుషులను ఉతికి ఆరేసే మెషీన్లు రాబోతున్నాయి.. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వారికి స్నానం చేసే ఓపిక ఉండకపోతే.. మెషీన్ టబ్‌లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు.. కాసేపటి తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు వస్తారట.
Divorce Temple: ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలకొద్దీ దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేక కథ, ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కొన్ని దేవాలయాలు వాటి గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందగా, కొన్ని వాటి మత విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో దేవతలకు, దేవుడులకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ, ప్రపంచంలోని ప్రత్యేకమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం ఉంది. Also Read: Jail Sentence :…
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ జపాన్‌ను ఓడించింది. 2-0 తేడాతో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఫైనల్‌లో చైనాతో తలపడనుంది. గ్రూప్ రౌండ్‌లో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. చివరి గ్రూప్ రౌండ్ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడింది. అప్పుడు కూడా భారత్ 3-0తో గెలిచింది.
Womens Asian Champions Trophy: బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ 3-0తో జపాన్‌ను ఓడించి లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ 5 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అత్యధికంగా 15 పాయింట్లతో ఒలింపిక్ రజత పతక విజేత చైనా (12) కంటే ముందుంది. మంగళవారం జరిగే సెమీస్‌లో భారత్ నాలుగో ర్యాంకర్ జపాన్‌తో తలపడుతుంది. అలాగే చివరి నాలుగో రెండో మ్యాచ్‌లో…
First Kiss: జపాన్‌లో ఎప్పుడూ లేనంతగా వింత ధోరణి కనిపిస్తోంది. జపాన్ హైస్కూల్ అబ్బాయిల్ తమ ‘‘ఫస్ట్ కిస్’’కి దూరమవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. హైస్కూల్ బాయ్స్‌లో ప్రతీ ఐదుగురిలో ఒక్కరు మాత్రమే తొలి ముద్దు అనుభవాన్ని పొందుతున్నట్లు తేలింది. 1974 నుంచి ఇదే అత్యల్ప సంఖ్యగా తేలింది.
Nitin Gadkari: తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలను, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తుండటంతో వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టుకు చిక్కులు తప్పేలా కనిపిస్తున్నాయి. ముంబై - అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి జపాన్, భారతదేశంలో చాలా విషయాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నికయ్యారు. మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబా.. తన ఐదవ ప్రయత్నంలో జపాన్ ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఫ్యూమియో కిషిదా తర్వాత తొమ్మిది మంది అభ్యర్థుల మధ్య జరిగిన అత్యంత పోటీ రేసులో షిగేరు ఇషిబా విజయం సాధించారు.
Asia power index: ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతి పెరుగుతోంది. ఇప్పుడున్న ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత చొరవ లేకుండా ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆర్థికం బలపడటంతో పాటు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండటం భారత్ గొప్పతనం. ఇదిలా ఉంటే ‘‘ఆసియా పవర్ ఇండెక్స్’’ రీజినల్ పవర్స్లో భారతదేశం సత్తా చాటింది.