భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. జనసేన ఆధ్వర్యంలో ఆయన జనవాణి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు స్థానికుల నుంచి వినతులను ఆయన స్వీకరిస్తున్నారు. https://www.youtube.com/watch?v=SHfMzjJ6Ebg
విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తాము కృషి…