మాట ఇస్తే మడమ తిప్పననే వాళ్లు విదేశాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. రాజకీయం అంటే బూతులు తిట్టడం కాదు.సమస్యల పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.వ్యవసాయం, టిడ్కో ఇళ్లకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా మా దృష్టికి వచ్చాయి.వలంటీర్లు సంతకం పెట్టని కారణంగా కూడా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది.సీఎం జగన్ ముద్దుల మామయ్య. తాను మామయ్యనని.. ముద్దుల పెడతానంటూ సీఎం జగన్ విద్యార్ధులకు చెప్పారు.ఇప్పుడేమో ఆ ముద్దుల మామయ్య ఫీజు చెల్లించడం లేదు.విదేశీ విద్య ఆపేశారన్నారు పవన్.
Komatireddy Venkat Reddy : పార్టీ మారడంపై ఆసక్తికర వ్యాఖ్యలు..
ఫీజు రీ-ఇంబర్సుమెంట్ చేయడం లేదు.సీఎం జగన్ కూతురు మాత్రం చదువుకుంటోంది.సీఎం కూతురు గురించి మాట్లాడ్డానికి సంస్కారం అడ్డొస్తోంది.. నేను మాట్లాడను.గురజాలలో సీఎం జగనుకు చెందిన సరస్వతి పవర్ అండ్ మినరల్స్ సంస్థ భూములు తీసుకుంది.. పరిహరం ఇవ్వలేదనే ఫిర్యాదు వచ్చింది. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కంపెనీకి భూములిచ్చామని రైతులు చెప్పారు. ఇప్పటికీ ఆ కంపెనీని మొదలు పెట్టలేదు.శాంతి భద్రతలకి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.ప్రశ్నించడానికి గొంతెత్తితే చాలు ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు పవన్ కళ్యాణ్.
విజయవాడలో జనసేన జనవాణి కార్యక్రమం ముగిసింది. ఈ జనవాణిలో 427 అర్జీలు వచ్చాయి.రెవెన్యూ, గృహ నిర్మాణం, మున్సిపల్, వ్యవసాయ, మంచి నీటి సమస్యలకు చెందిన ఫిర్యాదులు వచ్చాయి.జగన్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు.. వారి ఫిర్యాదులను తీసుకోవడం లేదు.సీఎం జగన్ జిల్లా పర్యటనలకు వెళ్తోన్న సందర్భంలో ప్రజలను కూడా కలవనీయకుండా బారికేడ్లు, తెరలు పెట్టేస్తున్నారు.వచ్చిన ఫిర్యాదులని పరిష్కరించాలని వివిధ శాఖలతో కో-ఆర్డినేట్ చేసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాం అన్నారు నాదెండ్ల మనోహర్.