ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్న చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి తండ్రుల తరువాత అన్నావదినలే నన్ను తల్లిదండ్రులుగాపెంచారు అని పవన్ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇక చిన్నతనం నుంచి పవన్ ఇంట్రోవర్ట్ గా పెరిగాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు.. చదువు కూడా అంతంత మాత్రమే.
మరోసారి పవన్ కల్యాణ్‌కు సవాల్ చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ నుంచి నాపై పోటీ చేయమని గతంలోనే పవన్ కి సవాలు చేశాను.. కనీసం గ్లాస్ గుర్తు అయినా నా మీద పోటీ పెట్టమని కోరుతున్నాను అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ ఎన్ని రివ్యూలు చేసుకున్న ఓడిస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చ సాగుతోంది. కుదిరిన పొత్తులపై క్లారిటీ లేకపోగా.. కొత్త పొత్తులపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం.. కొత్త చర్చకు దారి తీసింది.. అసలు సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో పొత్తుల విషయం ఇంకా అస్పష్టంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. పొత్తుల విషయం ఇంకా ఉందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు జనసేనలో కీలక బాధ్యతలను అప్పగించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ యాదవ్‌ను పవన్ కళ్యాణ్ నియమించారు. వంశీ నియామకాన్ని ఖరారు చేస్తూ జనసేన అధికారిక ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, పొత్తులపై తేల్చేందుకు సిద్ధం అవుతోంది భారతీయ జనతా పార్టీ.. ఏపీ వ్యవహరాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.. పొత్తులపై వీలైనంత త్వరగా క్లారిటీకి రావాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.. దీనికోసం ఇవాళ సాయంత్రం విజయవాడకు రాబోతున్నారు బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్.. రేపు జరిగే బీజేపీ ఏపీ కోర్ కమిటీ భేటీకి హాజరుకానున్నారు తరుణ్ చుగ్. ఇవాళ పదాధికారుల సమావేశం వివరాలు.. పొత్తులపై నేతల అభిప్రాయాలను…
గత వారంలో మూడు రోజులు కాకినాడ లోనే ఉన్న పవన్ కల్యాణ్.. కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు.. కాకినాడ సిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు సేనాని.. డివిజన్ల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు మొత్తం 50 డివిజన్ లలో 22 డివిజన్ ల రివ్యూ ముగిసింది.. మిగతా డివిజన్ లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు..
Minister Vidadala Rajini Fires on TDP: ప్రశాంతంగా ఉన్న గుంటూరు పశ్చిమలో కావాలనే అలజడి సృష్టిస్తున్నారని మంత్రి విడదల రజిని అన్నారు. టీడీపీ శ్రేణులు భయపెడితే.. భయపడే రకం తాను కాదన్నారు. తమ సొంత భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే.. టీడీపీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని ప్రశ్నించారు. వైసీపీ కుటుంభం అప్రమత్తంగా ఉండాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన…