Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. కుటుంబాన్ని, పండగలను, పిల్లలను అన్ని మర్చిపోయి ప్రజల కోసం పోరాడుతున్నాడు. వారి సమస్యలను పరిష్కరించాలని ఆరాటపడుతున్నాడు. ఒక స్టార్ హీరోగా ఏసీ కార్లలో తిరుగుతూ.. ఏడాదికి ఒక సినిమా చేస్తూ కోట్లు సంపాదించొచ్చు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి అని పేర్కొన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టింది.. అమరావతే మన రాజధాని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోంది.
మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. జనసేన-టీడీపీ- బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్తో చర్చించడం జరిగిందని ఆయన వెల్లడించారు. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవలసి ఉందని చెప్పగా.. 40 సీట్ల వరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ తెలిపారన్నారు.
ఏపీలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం వైపు పార్టీలు చూస్తున్నాయి. ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారా? ఆయన ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న తాజా పరిణామం ఇది.
ముద్రగడతో టచ్లోకి వెళ్లారు జనసేన పార్టీ నేతలు.. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్తో సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ.. జనసేన నేతలతో ఏకాంత చర్యలు జరిపినట్టు తెలుస్తోంది.