ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అంబటి రాయుడికి పవన్ కళ్యాణ్ వినాయకుడి వెండి ప్రతిమను బహూకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశం వివరాల గురించి అంబటి రాయుడు తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో తెలిపారు.
కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు సీఈసీ వద్దకు క్యూ కట్టాయి. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. వైసీపీ ఆరు అంశాలతో.. టీడీపీ-జనసేన ఎనిమిది అంశాలతో పరస్పరం ఫిర్యాదులు చేశాయి. కాగా.. నిబంధనల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేనకు గాజు గుర్తు కేటాయించకూదనే కీలకాంశాన్ని వైసీపీ తెర పైకి తెచ్చింది. మరోవైపు.. టెక్నాలజీతో ఓటర్ల యాప్ రూపొందించి అవకతవకలకు పాల్పడుతోందంటూ టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురంలో పనికిరాని మంత్రి.. రాజమండ్రి రూరల్‌లో పోటీకి పనికొస్తాడా అంటూ ఆరోపించారు. రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీపై మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని, అధిష్టానం ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించింది.. ఇప్పుడు ఉండదని…
రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చంద్రబాబు ' రా కదలిరా' సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు ముందే నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఈ సభకు.. ఏవి సుబ్బారెడ్డి రాకూడదని అల్టిమేటం జారీ చేశారు. ఆయన వస్తే రచ్చ రచ్చే అని అంటున్నారు. తాను సైలెంట్ గా ఉన్నా, అనుచరులు ఊరుకోరని భూమా అఖిల ప్రియ అంటున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి ముందు చెప్పింది అఖిల…
గుంటూరు జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య పొత్తుల వ్యవహారం క్షేత్రస్థాయిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుని కలిసిపోయామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఎవరికి వారే ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సీటు తమకే వస్తుందని జనసేన-టీడీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు సీటు కోసం పోటీపడుతున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ మోషెన్ రాజు, జూపూడి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. చాలా మంది బ్లడ్ రిలేషన్ కూడా కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, కొందరు కొత్త వాళ్ళు జగన్ ను దించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాతృభాష కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. న్యూజిలాండ్ 170 ఏళ్ల పార్లమెంట్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలు అయిన సాల్ ఎంపీ హనా-రౌహితి-మాపి-క్లార్క్ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌లోని తెగలలో మావోరీ భాష దాదాపు అంతరించిపోయింది. న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం.. మావోరీ ప్రజల భాషతో పాటు హక్కులను రక్షించడానికి ఈ యువ ఎంపీ పోరాడుతుంది. అయితే, కొన్ని రోజుల క్రితం ఎంపీ హనా రౌహితి పార్లమెంటులో ప్రసంగం చేస్తూ.. మావోరీ…
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా.. క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరీ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఆమే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చేసి వాడుకుంటున్నారని, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలు ప్రచారం చేసుకుంటున్నారని పురందేశ్వరీ అన్నారు.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో పలు అంశాలు పరిశీలించాలంటూ పవన్ కల్యాణ్‌కు సూచించారు హరిరామ జోగయ్య.. సీఎం వైఎస్ జగన్‌ను ఓడించాలంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలు చేయాలన్నారు.
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో రహస్యంగా సమావేశం అయ్యారట.. విశాఖలోని బీచ్ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ రహస్య సమావేశంలో కీలక అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి సెల్ ఫోన్లకు కూడా అనుమతి ఇవ్వకుండా జాగ్రత్త వహించారట నిర్వాహకులు.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గెలుపే ప్రధానంగా పనిచేయాలని నిర్ణయించారట..