ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. వారసత్వంగా నాకు అప్పు వచ్చింది.. రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తా అన్నారు..
Visakha Mayor: గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది.
ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వ్యవహారం అక్క పెత్తనం- చెల్లెలి కాపురంలా మారిపోయిందా? ఎమ్మెల్యే పదవి ఒక పార్టీది అయితే…. మరో పార్టీ నాయకులు పవర్ సెంటర్స్‌గా మారిపోయారా? మనం జస్ట్…. పేరుకు ఎమ్మెల్యేలుగా, ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోవాల్సిందేనా అని వాళ్ళంతా మధనపడుతున్నారా? మెల్లిగా అది బ్లాస్టింగ్ స్టేజ్‌కు చేరుకుంటోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎవరా ఎమ్మెల్యేలు? అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అత్యధికంగా సీట్లు సాధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉందా అంటే……
తాను ఏదీ ప్లాన్ చేసుకోలేదని, ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో ఆడుగుపెడుతుందని ఆ ఆపార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గుడ్ లీడర్ అని, పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని ఆయన ఉదార వైఖరిని అభినందించాల్సింద అన్నారు. పార్టీ పెట్టడం ముఖ్యం కాదని, నిలబెట్టుకోవడమే ముఖ్యం అని పేర్కొన్నారు. సినీ నటులు రాజకీయాల్లో వచ్చి గెలవడం అంతా ఈజీ కాదని, అది కేవలం…
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదట. సొంత జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తున్నారాయన. కానీ... తీరా శాసనమండలికి వెళ్ళాక అధికార కూటమికి కాస్త దగ్గరగా జరుగుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో త్రిమూర్తులు ఏ వైపు ఉన్నారు?
మూడో జాబితాలో మరికొన్ని కీలక పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్.. దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి చేశారు.. 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా సిద్ధం అవుతోందట.. చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు రాగా.. ఈ వారంలో పదవుల భర్తీకి సన్నాహాలు సాగుతున్నాయి.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్..
నియోజకవర్గాల పునర్విభజనపై ఆహ్వానం వచ్చింది.. కానీ, హాజరు కాలేమని సమాచారం ఇచ్చామని జనసేన ప్రకటించింది.. చెన్నైలో డీఎంకే.. నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది.. అయితే, హాజరుకాలేమని సమాచారం అందించామని పేర్కొంది..
నేను హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన ఇతర మతాలు ఇబ్బంది పడేలా మాట్లాడను.. అసమానతలను వెతుక్కోను, అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటా.. సనాతన ధర్మాన్ని పటిస్తాను, అన్ని మతాలను గౌరవిస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (మార్చ్ 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఉదయం 9.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు పవన్..
Off The Record: అక్కడ వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా తయారైందా? మూడు నియోజకవర్గాల్లో అయితే... అసలు ఫ్యాన్ స్విచ్చేసే దిక్కే లేకుండా పోయిందా? పరిస్థితుల్ని అనుకూలంగా మల్చుకునే అవకాశం వచ్చినా లోకల్ లీడర్స్ పట్టించుకోవడం లేదా? చెయ్యాల్సిన చోట పని చేయకుండా పక్క నియోజకవర్గాల్లో పెత్తనాలు ఎక్కువయ్యాయా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎందుకంత దారుణంగా మారింది?.