విశాఖ గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం పట్టుబిగిస్తోంది.. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనలోకి 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాలను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి అగ్ని పరీక్షగా మారింది అవిశ్వాసం ఓటింగ్. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం…
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాసం నెగ్గితే మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారు.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రమాదంపై పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. ‘నా కొడుకు సమ్మర్ క్యాంప్ కోసం వెళ్లాడు. అక్కడ చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఊపరితిత్తుల్లో కొంత సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతోది. ఇలాంటి సమయంలో ప్రతి తల్లిదండ్రులకు చాలా బాధ…
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అప్పుడన్న మీరు జగన్ ను మించిపోయారు అప్పు తేవడంలో.. రాష్ట్ర అప్పుల పైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని.. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు అని చెప్పి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అప్పులు తెస్తున్నారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.
MLC Nagababu: జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు నాగబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగు దేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.
ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్ను నాగబాబు ఓపెన్ చేస్తుండగా.. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన అంటూ జనసైనికులు కౌంటర్ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో…
అనకాపల్లి జిల్లా... యలమంచిలి సెగ్మెంట్లో కూటమి పాలిటిక్స్ హాట్ మెటల్లా సలసలమంటున్నాయి. టీడీపీ, జనసేన మధ్య అంతర్గత రచ్చ బజారుకెక్కింది. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దూకుడుని తట్టుకోవడం టీడీపీ నేతలకు మహా కష్టంగా మారిందట. ఇది కొత్తగా వచ్చిన ఇబ్బంది కాదని.. పొత్తులు పుట్టినప్పుడే ఇలాంటి బుల్డోజ్ రాజకీయాల్ని ఊహించామంటూ ఘొల్లుమంటున్నాయి టీడీపీ శ్రేణులు. కూటమి ధర్మానికి కట్టుబడి శాసనసభ్యుడు వ్యవహరిస్తారని ఆశించినప్పటికీ పరిస్ధితుల్లో మార్పు రాలేదని బహిరంగానే అంటున్నారట.
MLC Nagababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఈ రోజు (ఏప్రిల్ 3న) జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
AP Cabinet Meeting: ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధనాంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.