పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టే పనిలో ఇరు పార్టీల పెద్దలు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయవాడలో తాడేపల్లిగూడెంకు చెందిన టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జి, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లతో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలేమీ లేవని.. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ-జనసేన కలిసి…
శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్‌కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న నియోజకవర్గం పోలవరం. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా ఇక్కడ జనసేన జెండా ఎగిరింది. సరైన క్యాడర్ లేకపోయినా.. నడిపించే నాయకులు లేకున్నా... కూటమి వేవ్‌లో, టిడిపి సహకారంతో జనసేన తరపున గెలిచారు చిర్రి బాలరాజు. ఎన్నికలకు అవసరమైన నిధులు సమకూరే వరకు, ఫలితాలు వచ్చే వరకు అందరితో సఖ్యతగా ఉన్నట్టు వ్యవహరించిన బాలరాజు గెలిచాక మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తున్నారట. సొంతగా జట్టును పెట్టుకుని ప్రతి పనికీ పర్సంటేజ్ ఫిక్స్ చేసి…
ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో టార్గెట్ పేరుతో రైతులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మాటల్లో వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువగా ఉండటంతో కొంత సమస్య ఏర్పడిందని, లక్ష్యానికి మించి దాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు వద్ద ప్రతిదాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి మాటలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి ప్రధాని…
పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే భారత్ వదిలి వెళ్లిపోండి అంటూ పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నవారిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
కాకినాడ జిల్లా జగ్గంపేట కూటమిలో అగ్గి అంటుకోవడమే కాదు.... అది భగభగ మండే స్థాయికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన నాయకులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళడమేకాకుండా... వీధి పోరాటాలకు సిద్ధమవడం కలకలం రేపుతోంది.
ఆరిణి శ్రీనివాసులు... తిరుపతి ఎమ్మెల్యే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన టిక్కెట్ తెచ్చుకుని భారీ మెజారిటీతో గెలిచారాయన. ఎన్నికలకు ముందు వరకు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆరిణికి టిక్కెట్ ఇవ్వడాన్ని తిరుపతి టిడిపి జనసేన నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయినాసరే... ఫైనల్‌గా ఆయనకే ఖరారు చేశారు పవన్‌కళ్యాణ్.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడం అని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
ఏలూరు రోడ్డులోని పాత బస్టాండు వద్ద జనసేన సభ్యులు మానవహారం నిర్వహించారు. పహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ నిర్వహించిన మానవహారంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మానవహారం నిర్వహించినట్లు తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూధన్ ఉగ్రదాడిలో మరణించడం బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అందరం కలిసి ముందుకెళ్ళాలని పిలుపునిచ్చారు. మనదేశం, మనరాష్ట్రం.. ఆ తరువాతే మనందరమన్నారు. సమాజం కోసం, దేశం కోసం మనందరం నిలబడాలని…
సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ.. అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి.. అప్పు.. సంపద పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్రంలో మద్దతు ఉంది అని చెప్పుకుంటున్నారు..