తిరుపతి జిల్లాలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐదో విడుత నేతన్న నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… మంచి చేస్తున్న వారిని సంస్కారం ఉన్నవారు అవమానించరని, కానీ మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి సంస్కారాలు కోల్పోయి మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తోందని, ఎండ అయినా వాన అయినా 1వ తేదీన చిరునవ్వు తో సూర్యోదయం కంటే ముందే పెన్షన్ ఇస్తున్నారని, ప్రభుత్వం అందించే సేవలను ఇంటికి అందిస్తున్న వాలంటీర్లపై కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Ambati Rambabu : అవగాహన లేకపోవడంతోనే శ్రీవాణి ట్రస్ట్ పై రాజకీయ అరోపణలు చేస్తున్నారు
దీనికి స్క్రిప్ట్ ఈనాడు రామోజీ రావు నిర్మాత చంద్ర బాబు…నటన పవన్ కళ్యాణ్ ది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారట.. ఇంత అన్యాయంగా బురద చల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సేవలు అందిస్తున్న వాలంటీర్ల క్యారక్టర్ ను తప్పు పడుతున్నది ఎవరంటే.. పదేళ్లుగా చంద్రబాబు కు వాలంటీర్ గా పనిచేస్తున్న నేత అని, చంద్రబాబు.. దత్తపుత్రుడు..ఆయన సొంత పుత్రుడు..ఆయన బావ మరిది క్యారక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. బాబు దత్త పుత్రుడు.. ఒకరితో వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆయన మన వాలంటీర్ల గురించి మాట్లాడతారని, ఇంకొకడు స్విమ్మింగ్ ఫూల్ లో అమ్మాయిలతో ఎలా ఉన్నాడో యు ట్యూబ్ లో కన బడుతుందని, మరొకరు అంటారు.. అమ్మాయి కనపడితే ముద్దాయినా పెట్టాలి.. కడుపైన చేయాలని అంటాడని.. ముసలాయన అంటాడు.. బావా మీరు సినిమాల్లో చేశారు… నేను నిజంగా చేసారని అంటారని అంటూ జగన్ కౌంటర్లు వేశారు.
Also Read : Kalki 2898 AD Story: ‘కల్కి’గా ప్రభాస్.. సినిమా స్టోరీ ఇదేనా?