జనసేన అధినతే పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర విడత వారీగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతలు చేపట్టిన వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ నాలుగో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తన దృష్టంతా అటువైపుగా మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.
Janasena: ఏపీలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది.
ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశ విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Blood Donation Camp: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని చిరంజీవి చెల్లెలు మాధవి రేపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ప్రారంభించనున్నారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన జనసేనాని.. బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ సారి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇలాకాలో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్.. జనసేనాని కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 20న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల…
సెలబ్రిటీలంటే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. అవకాశం వస్తే ఫోటో దిగాలని ముచ్చట పడ్డం సహజం. ఇటువంటి సరదానే తీర్చుకున్నారు ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయంగా తమకు ప్రత్యర్థి అయిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో ఓ ఫోటో దిగారు. అది ఏడేళ్ల కిందటి ముచ్చట. ప్రస్తుతం పవన్, వైసీపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. రాజకీయవైరం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఈ క్రమంలో పవన్ పై విరుచుకుపడుతున్నారు మంత్రి అమర్నాథ్. ఇటీవల కౌలురైతుల ఆత్మహత్యలపై…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డైరెక్షన్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఇటీవలి ఎన్నికల విజయంతో మంచి ఊపు మీద ఉంది. ప్రతికూల పరిస్థితులలోనూ ఉత్తరప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారం నిలబెట్టుకోవటం గొప్ప విశేషం. ఈ గెలుపుతో 2024 ఎన్నికల్లో కూడా తమదే విజయం అనే నిర్ధారణకు వచ్చారు కమలనాథులు. దాంతో, జాతీయ స్థాయిలో మరింత బలోపేతం అయ్యేందుకు పక్కాగా వ్యూహాలు రూపొందిస్తోంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలలో తమ వ్యతిరేకుల రాజకీయ నిర్మూలనపై ఫోకస్ పెట్టబోతోంది.…
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం పరిధిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. జనసేన పార్టీ స్థాపించి 8 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహించే ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. సభలో వీరమహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం…