‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’అనే నానుడిని నిజం చేసిన వారు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కృష్ణంరాజు స్థానం ప్రత్యేకమైనది. తొలి చిత్రం పరాజయం చవిచూసినా, పట్టువదలని విక్రమార్కునిలా చిత్రసీమలో పలు పాట్లు పడ్డారు. చివరకు కోరుకున్న విజయం సాధించారు. జనం మదిలో ‘రెబల్ స్టార్’గా నిలచిపోయారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ కృష్ణంరాజుకు ఫోటోలు తీయడమంటే…