Dal lake: ప్రముఖ పర్యాటక ప్రాంతం శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. సరస్సులోని బోట్‌హౌజులను అగ్ని చుట్టుముట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మరణించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా బంగ్లాదేశ్‌కి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 5 హౌజ్ బోట్లు ధ్వంసమయ్యాయి.
Fire in Dal lake: శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో శనివారం ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఐదు హౌస్ బోట్లు బూడిదయ్యాయి. సరస్సులోని పీర్ నంబర్ 9 వద్ద పార్క్ చేసిన హౌస్ బోట్లో మొదట మంటలు చెలరేగాయి.
Pakistan: ఇన్నాళ్లు భారత వ్యతిరేక ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షితం అని భావిస్తుండే వారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏ ఉగ్రవాది ఎప్పుడు ఎలా కిడ్నాప్ అవుతాడో, ఎప్పుడు ఎక్కడ చనిపోయి పడుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంతలా అంటే పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐకి కూడా తెలియకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి పడేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన వారు, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఖతం అవ్వడం పాకిస్తాన్‌కి మింగుడుపడటం లేదు. యథావిధిగా…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2023లో శనివారం ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వాటిని రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ని విమర్శించారు. గతంలో ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ సాయం కోసం ప్రపంచానికి విజ్ఞప్తి చేసేదని, ఇప్పుడు దాడుల వెన ఉన్న దేశాలు తమను రక్షించాలని కోరుతున్నాయని అన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఓ పోలీసును ఉగ్రవాదులు అతని ఇంటిలోనే కాల్చిచంపారు. లోయలో గత మూడు రోజుల్లో ఇది మూడో లక్షిత దాడి కావడం గమనార్హం. బారాముల్లాలోని కరల్‌పోరా గ్రామంలోని కానిస్టేబుల్ గులాం మహ్మద్ దార్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీనగర్ లోని ఈద్గా సమీపంలో ఉగ్రవాదులు ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్‌పై కాల్పులు జరిపి గాయపరిచారు. అతన్ని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాము అని కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్(ట్విట్టర్)లో తెలిపారు. ప్రస్తుతం పోలీస్ అధికారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Jammu Kashmir: జమ్ము కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్‌కి సంబంధమే లేదని, పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కి చెందిన రాజకీయ కార్యకర్త, ప్రొఫెసర్ సజ్జాద్ రజా అన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లా చూస్తోందని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సౌకర్యాలను పొందే హక్కు ఉందని ఆయన అన్నారు. కొంతమంది బ్రిటీష్ ఎంపీలతో సహా పలువురు వక్తలు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీరీ పండిట్ల…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గురువారం రోజున ఉగ్రవాదలు కుప్వారా సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. హతమైన ఐదుగురు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి ఈరోజు భారత ఆర్మీ దళాలు చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేయడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Jammu Kashmir: ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్లుగా పాక్ కి ఎంత చెప్పిన తన వికృత చేష్టలు మాత్రం మానదు. తాజాగా మరోసారి భారత భూభాగం లోకి ప్రవేశించాలని చూసారు పాక్ ఉగ్రవాదులు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు మన సైనికులు. వివరాలలోకి వెళ్తే.. ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్లో ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించిందేకు ప్రయత్నించారు. కాగా ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత…