Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా మాధ్‌పూర్‌కు చెందిన జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబాగా పిలిచే వ్యక్తి అసలు నిజ స్వరూపం వెలుగులోకి వస్తోంది. మతమార్పిడే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్‌ని కలిగి ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఏకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని ‘లవ్ జిహాద్’ కోసం ఆపరేట్ చేస్తున్నట్లు తెలిసింది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న గ్రామంలోని ఛంగూర్ బాబాకు చెందిన విలాసవంతమైన భవనంలో సోదాలు చేయగా, విస్తూ పోయే విషయాలు…