Suriya: ‘జై భీమ్’ కేసులో సంచలన తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సూర్య నటించిన జై భీమ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమ కులాన్ని అవమానించేలా ఉన్నాయని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. తమ కులాన్ని అవమానించిన సూర్య, జ్యోతిక, డైరెక్టర్ జ్ఞానవేల్ రాజాపై వారు కేసు నమోదు చేసి కోర్టు వరకు వెళ్లారు. ఈ కేసులో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన వారు కోర్టును కోరారు. ఇక ఈ కేసుపై విచారణ జరిపిన చెన్నై కోర్టు సూర్య, జ్యోతిక, డైరెక్టర్ జ్ఞానవేల్ రాజాను విచారణకు హాజరు కావాలని, లేని యెడల వారిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయబడుతుందని ఆదేశాలు జారీ చేశారు. అయితే చెన్నైలోని వేలచేరి పోలీస్ స్టేషన్‌లో తమపై నమోదైన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్)ని కొట్టివేయాలని జ్ఞానవేల్ మద్రాస్ హైకోర్టులో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు.
ఇక తాజాగా నేడు ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సూర్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ కేసులో బాధితులు తెలిపినట్లు చిత్ర బృందంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. చిత్రంలో వన్నియార్ సంఘానికి సంబందించిన పేర్లను వాడలేదని, ఆ పేర్లు సాధారణమైనవే అని తేల్చి చెప్పింది. పిటిషనర్లు ప్రార్థించిన విధంగా కేసు నమోదుకు అనుగుణంగా తదుపరి అన్ని చర్యలను నిలిపివేయాలని తెలుపుతూ తీర్పు నిచ్చింది. దీంతో సూర్యకు ఈ కేసులో ఊరట లభించిందని తెలుస్తోంది. మరి ఈ విషయమై ఇప్పటికైనా సూర్య నోరు విప్పుతాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య- బాల కాంబోలో వస్తున్న అచలుడు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కూడా కొంత దళిత సమస్యలు ఉంటాయని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా కూడా మరో వివాదానికి దారి తీస్తుందేమో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!