69న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. బెస్ట్ సినిమాగా ఆర్ ఆర్ ఆర్, బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకున్నారు. ఒకప్పుడు ప్రాబబుల్స్ లో కూడా లేని చోటు నుంచి ఇప్పుడు ఒకే ఏడాది పది నేషనల్ అవార్డ్స్ గెలిచే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇదిలా ఉంటే నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించిప్పటి నుంచి కోలీవుడ్ లో మా సినిమాలని అన్యాయం జరిగింది, ఈ సినిమాలకి నేషనల్ అవార్డ్స్ రావాల్సింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ కూడా ఆ సినిమాలకి అవార్డ్స్ వచ్చి ఉంటే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానులు అవార్డులు వస్తే బాగుండు అని కోరుకుంటున్న సినిమాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈ లిస్టులో చెప్పుకోవాల్సింది జై భీమ్ సినిమా గురించి.
సూర్య హీరోగా నటించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాకి ఒక్క అవార్డు కూడా రాకపోవడం బాధాకరం. ఎందుకంటే జై భీమ్ సినిమాలో సూర్య సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సిన్నతల్లి పాత్రలో లిజోమోస్ అయితే ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. రాజకున్నుగా సిన్నతల్లి భర్త పాత్రలో మణికందన్ ప్రేక్షకులని కట్టి పడేసాడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని ప్రతి ఒక్కరూ అనుకున్నారు కానీ ఒక్కరికి కూడా అవార్డ్ రాలేదు. ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది సార్పట్ట పరంబర్తె సినిమా గురించి. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సింగ్ రింగ్ చుట్టూ తిరుగుతూనే సొసైటీలో ఉండే ఇష్యూస్ ని టచ్ చేస్తుంది. డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సార్పట్ట సినిమాకి నేషనల్ వైడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కోసం ఆర్య పడిన కష్టం తెరపై ప్రతి సీన్ లో కనిపిస్తుంది. బెస్ట్ యాక్టర్ కేటగిరిలో లేదా కనీసం స్పెషల్ మెన్షన్ కేటగిరిలో అయినా సార్పట్ట పరంబర్తె సినిమాకి గాను ఆర్యకి నేషనల్ అవార్డ్ వచ్చి ఉంటే బాగుండేది.
ఇక లిస్టులో చెప్పాల్సిన లాస్ట్ సినిమా ‘కర్ణన్’. ధనుష్ హీరోగా మారీ సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన కర్ణన్ సినిమా క్రిటికల్లీ అక్లయిమేడ్ మూవీ. అసురన్ అంత గొప్ప సినిమా కాదు కానీ మంచి సినిమా అనే చెప్పాలి. ధనుష్ కూడా అవార్డ్స్ ఇచ్చే స్థాయిలో పెర్ఫార్మ్ చెయ్యలేదు. అయితే ఈ మూవీకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో మళయాల నటుడు ‘లాల్’కి నేషనల్ అవార్డ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే లాల్ లేని కర్ణన్ సినిమాని ఊహించడం కూడా కష్టమే. అతని క్యారెక్టర్ ని లాల్ పోట్రె చేసిన విధానం, ఆ క్యారెక్టర్ ని డైరెక్టర్ ఇచ్చిన ఎండింగ్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంటాయి. అందుకే ఈ క్యారెక్టర్ నేషనల్ అవార్డ్ కి పూర్తిగా అర్హుడు అనే చెప్పాలి. కర్ణన్, జై భీమ్, సార్పట్ట పరంబర్తె సినిమాలు అవార్డ్ గెలుచుకునే సినిమాలే, వీటిని తక్కువ చేయడానికి ఏమీ లేదు. ఈ సినిమాలకి ఒక్క కేటగిరిలో అవార్డు రాకపోవడమే తమిళ మీడియా సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టడానికి కారణం అయ్యింది.