Congress Leader’s Mother Brutally Murdered in Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాచుపల్లి గ్రామంలో ఓ మహిళను దుండగులు అతికిరాతకంగా బండరాయితో తలపై మోది హత్య చేశారు. అక్కడితో ఆగకుండా శవాన్ని ఈడ్చుకెళ్లి పక్కనే ఉన్న బావిలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటన కొడిమ్యాల మండలంలో కలకలం రేపుతోంది. Also Read: CPI Narayana: రజనీకాంత్…
Off The Record: జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం మరోసారి హీటెక్కింది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే టార్గెట్‌గా మళ్లీ నిప్పులు కురిపించారు. దీంతో ఆయన, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తాజాగా మాటల యుద్దం షురూ అయింది. జగిత్యాల ప్రజల కోసం నూకపల్లి అర్బన్ కాలనీలో ఇళ్ళ నిర్మాణం కేంద్రంగా ఈ వివాదం మొదలైంది. తన హయాంలో నిర్మించిన ఇళ్లను కూల్చివేశారని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేయగా.. అసంపూర్తిగా…
Shocking Incident at Jagtial Girls’ Junior College: దొంగల్లో కూడా ‘వెరైటీ దొంగ’ ఏంట్రా అని అనుకుంటున్నారా?. దొంగతనం చేయడం నేరమే అయినా.. అందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు దొంగలు బంగారం, డబ్బు దోచేస్తారు. మరికొందరు ఇంట్లోని విలువైన వస్తువులు కొట్టేస్తాడు. ఇంకొందరు అయితే బట్టలు, చెప్పులు సర్ధేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే దొంగ విలువైన వస్తువులు ఏవీ ముట్టుకోడు. కేవలం బుక్స్ మాత్రమే దొంగతనం చేస్తాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ…
అసూయ, పగ, ప్రతీకారం మనుషుల్ని ఉన్మాదులుగా మార్చుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హత్యే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సొంత చిన్నమ్మే ఆ చిన్నారిని చిదిమేసింది. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి పేరు హితిక్ష. తండ్రి రాములు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి నవీనతో కలిసి కోరుట్లలో ఆదర్శనగర్‌లో ఉంటుంది హితిక్ష. ఈ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పక్కింట్లో ఉన్న బాత్‌రూమ్‌లో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. సాయంత్రం…
జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిని పిన్ని అయ్యే మహిళ దారుణంగా గొంతు కోసి చంపేసింది. కేవలం ఆ చిన్నారి తల్లిదండ్రులతో ఉన్న అసూయతోనే అఘాయిత్యానికి పాల్పడింది. అంతే కాదు బాలికను చంపేసి ఏం తెలియనట్లు డ్రామా అడిన కిలాడీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక..అదే కాలనీలోని మరొకరి ఇంటిలో శవమై…
Jagtial: అక్రమంగా నిలువ ఉంచిన 800 క్వింటాళ్ల PDS రైస్ ను హైదరాబాద్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. జగిత్యాలలోని హనుమాన్ రైస్ మిల్ లో 800 క్వింటాల్ల PDS రైస్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్, జగిత్యాల సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అధికారులు పక్కా సమాచారంతో రైస్ మిల్ పై దాడి చేయగా రైస్ మిల్ ఆవరణలో ఒక ఆటోలో 30 క్వింటాళ్ల PDS రైస్ పట్టుకున్నారు. ఈ దాడుల…
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ షెడ్డులో ఉన్న వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విగ్రహానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విగ్రహాన్ని తరలిస్తున్న యువకులు విద్యుదాఘాతానికి గురయ్యారు. కోరుట్ల శివారులో 33కేవీ విద్యుత్ తీగలు వినాయక విగ్రహనికి తగిలి 9 మందికి విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఒక షెడ్డు నుంచి మరో షెడ్డు కు 13 ఫిట్ల విగ్రహాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఊహించని ఈ ప్రమాదంతో అక్కడున్నవారంతా వణికిపోయారు. ఆ…
పాములన్నాక చెట్లు, పుట్టల వెంట తిరుగుతుంటాయి. ఇటీవల జనావాసాల్లోకి వచ్చి హల చల్ చేస్తున్నాయి. ఇదే విధంగా నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపైకి ఓ నాగుపాము వచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆ పామును గమనించాడు. దాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు. ఈ ప్రయత్నంలో పాము గేర్ బాక్సులోకి చొరబడింది. ఆ తర్వాత స్థానిక యువకుల సాయంతో పామును బయటకు తీసి చంపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. Read…
తెలంగాణ పోలీసులను ఓ రిమాండ్ ఖైదీ బురడీ కొట్టించాడు. కోర్టు ఆవరణలో కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే.. పోలీసుల కండ్లుగప్పి పరారయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబసభ్యులను డీటెయిల్స్ అడిగి పలు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకోవడం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల సబ్ జైలులో పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ రిమాండ్…
Jagtial: మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఈ రోజు (మే 1న) జగిత్యాల సఖి కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ములుగుతున్న ఓ వృద్ధురాలి రోదనలు వినిపించాయి.