జగిత్యాల జిల్లాలో ఓ ప్రేమికుడు పెట్రోల్ బాటిల్‌తో పోలీస్ స్టేషన్ ముందు హల్‌చల్ చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని దగ్గరకు వస్తే నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడుతానని హెచ్చరించాడు. అరగంటపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. కరీంనగర్‌కు చెందిన యువతిని ప్రేమిస్తే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనిని ఆందోళన వ్యక్తం చేశాడు. జగిత్యాలకు చెందిన వెంకటరమణ ప్రేమ పేరుతో తమ కూతురును వేధిస్తున్నాడని యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంకటరమణను…
జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఏఐసిసి పిలుపుమేరకు పెట్రోల్, డీజిల్ గ్యాస్ పెరుగుదలకు నిరసనగా ఎమ్మెల్సీ జీవం రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ చౌరాస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై నిరసన తెలిపుతున్న తరుణంలో వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొద్ధిసేపు…
జగిత్యాల జిల్లాల రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక ఘటన చోటు చేసుకుంది. దీని పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు రాయికల్ పోలీసులు. ఐదు రోజులుగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారులు, బాలల సంక్షేమ సమితి అధికారులు విచారణ జరిపారు. ఈనెల 25న బాలిక ఇంటికి వెళ్లగా ఇంట్లో లేక పోవడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో బాలికకు చికిత్స…