Jagtial: అక్రమంగా నిలువ ఉంచిన 800 క్వింటాళ్ల PDS రైస్ ను హైదరాబాద్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. జగిత్యాలలోని హనుమాన్ రైస్ మిల్ లో 800 క్వింటాల్ల PDS రైస్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్, జగిత్యాల సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అధికారులు పక్కా సమాచారంతో రైస్ మిల్ పై దాడి చేయగా రైస్ మిల్ ఆవరణలో ఒక ఆటోలో 30 క్వింటాళ్ల PDS రైస్ పట్టుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో రైస్ మిల్ యజమాని కొండ లక్ష్మణ్ పై 6A కేసు నమోదు చేసారు అధికారులు.
Read Also:Crime News: దారుణం.. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కసాయి కొడుకు..!
రైస్ మిల్లు యజమాని కొండా లక్ష్మణ్ పై గతంలో కూడా పిడీ కేసు నమోదు చేసారు అధికారులు. అయినా తీరు మార్చుకొని మిల్ ఓనర్. తాజాగా పట్టుకున్న PDS రైస్ ను పంచనామ నిర్వహించి మెట్ పల్లి గోదాముకు తరలించి నివేదికను కలెక్టర్ కు లేదా జేసికి అందజేస్తామని అధికారులు తెలిపారు. తక్కువ డబ్బులకు పెద్ద ప్రజలకు అందించే ఈ PDS రైస్ ఇలా అక్రమ మార్గాల ద్వారా పెద్దెతున్న మిల్లులకు చేరుతున్నాయి. వీటిని పాలిష్ చేయడం, లేదా నూకగా మర్చి పక్క రాష్ట్రాలకు తరలించి వ్యాపారాలు డబ్బును ఆర్జిస్తున్నారు.
Read Also:ENG vs IND: ఒక్క టెస్టులో 5 సెంచరీలు.. కానీ ఏం లాభం..?