తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడో కొత్త రకం చర్చ మొదలైందట. పార్టీలో అందరిదీ ఒక లైన్ అయితే... జగ్గారెడ్డిది మరో లైన్ అని మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. గాంధీభవన్‌లో ఇటీవల పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో జగ్గారెడ్డి అన్న మాటల గురించే ఇప్పుడు చర్చ అంతా. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో బాగా ప్రచారం జరగాలంటే... కార్యకర్తలని సంతోషపెట్టడం ముఖ్యమని సూచించారట ఆయన.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేని.. ఎవరు ఎదుర్కోలేరని సీఎం రేవంత్‌రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. జులై 4 న హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తన నియోజకవర్గంలో క్యాన్సర్‌తో బాధపడే నిరుపేదలకు ట్రీట్‌మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో క్యాన్సర్ పేషెంట్‌లు బతకడం లేదని, ట్రీట్‌మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో తాను ఎంతో మందికి సహాయం…
పార్టీ లైన్ దాటొద్దు.. జనసేన నేతలకు హెచ్చరిక..! జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్‌లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో, సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ లేఖ జనసేన కేంద్ర కార్యాలయం,…
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీజేపీ నేత ఈటెల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ మునుపటి నుండి స్పష్టమైన స్థానం తీసుకుందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తప్పు అని జగమెరిగిన సత్యమని, అప్పట్లో ఈటల రాజేందర్ కూడా ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఆయన అవినీతిపై మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని జగ్గారెడ్డి…
ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఏ రోజు తాను సీఎంగా అహంకారానికి పోలేదని చెప్పారు. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని.. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. సంగారెడ్డి…
EX MLA Jagga Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటెల రాజేందర్ వి నాన్సెన్స్ కామెంట్స్.. రండ అంటే అర్థం ఏంటో చెప్పు ఈటల అని ప్రశ్నించారు.
Jagga Reddy: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ యుద్ధంపై చర్చ కంటే ఎక్కువ ఇందిరా గాంధీ ఉన్నప్పుడు జరిగిన యుద్ధం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.
కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటి ఇంటికి అధికారులు వెళ్లి సర్వే చేశారన్నారు. కుల గణనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రేవంత్ సక్సెస్ అయ్యాడు కాబట్టి డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయకండన్నారు.
Jagga Reddy: రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రధాన అంశం కుల గణన.. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు.