Jagga Reddy: క్యాన్సర్ పేషెంట్‌లకు ఆర్థిక సాయం అందిస్తా.. మీడియా ముందుకు ఎందుకొచ్చానంటే?
- క్యాన్సర్ పేషెంట్‌కు జగ్గారెడ్డి ఆర్థిక సహాయం
- సదాశివపేటలో క్యాన్సర్ పేషెంట్‌కు 10 లక్షల రూపాయలు
- సంగారెడ్డి పట్టణంలో పేషెంట్‌కు 4 లక్షల రూపాయలు
- క్యాన్సర్ బాధితులది టెన్షన్‌లతో కూడిన జీవితం
- క్యాన్సర్ పేషెంట్‌లకు ఆర్థిక సాయం అందిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన నియోజకవర్గంలో క్యాన్సర్‌తో బాధపడే నిరుపేదలకు ట్రీట్‌మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో క్యాన్సర్ పేషెంట్‌లు బతకడం లేదని, ట్రీట్‌మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో తాను ఎంతో మందికి సహాయం చేశానని, రాష్ట్రంలోని దాతలు కూడా సహాయం అందించాలనే ఉద్దేశంతోనే ఇలా మీడియా ముందుకు వచ్చానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వర వాడకు చెందిన రాణికి బ్రెస్ట్ క్యాన్సర్ రాగా.. ఈరోజు ఆమెను జగ్గారెడ్డి పరామర్శించారు. ట్రీట్‌మెంట్ కోసం నాలుగు లక్షలు రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘రాణికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్‌మెంట్ కోసం ఆర్థిక సహాయం నాలుగు లక్షలు అందించాను. స్పెసిఫిక్‌గా మీడియా ముందుకు రావడానికి ఓ కారణం ఉంది. క్యాన్సర్ ఎవ్వరికీ రావొద్దు. క్యాన్సర్ బాధితులది టెన్షన్‌లతో కూడిన జీవితం. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు. లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో బతకడం లేదు. పేషెంట్ ట్రీట్‌మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు’ అని అన్నారు.
Also Read
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
Also Read: BJP MP Laxman: రాహుల్, రేవంత్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు!
‘నా నియోజకవర్గానికి చెందిన ఆర్థిక స్థోమత లేని పేద క్యాన్సర్ పేషెంట్‌లకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నా. మొన్న సదాశివపేటలో క్యాన్సర్ పేషెంట్‌కు 10 లక్షల రూపాయలు, ఈరోజు సంగారెడ్డి పట్టణానికి చెందిన క్యాన్సర్ పేషెంట్‌కు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించాను. నా వద్దకు ఆరోగ్య సమస్యల ట్రీట్‌మెంట్ కోసం సహాయం కావాలని ఎంతో మంది వస్తారు. వారికి నా ద్వారా సహాయం అందుతుంది. కానీ.. ఎన్నడూ మీడియాలో రాదు, అది నాకిష్టం ఉండదు. ఇలా మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో ఎంతో మంది దాతలు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్‌లకు వారి ద్వారా సహాయం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో మీడియా ముఖంగా అందించడం జరిగింది’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?