తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రధాని మాట్లాడారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడి అభినందించారు. జనవరి 2 న జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అలా చేసిందని ఆరా తీశారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీకి…
కరీంనగర్లో అరెస్టై జైలులో వున్న కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్ తో పాటు ముగ్గురు కార్పొరేటర్లను జైల్లో పరామర్శించానన్నారు ఈటల. మొన్న జరిగింది అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య విలువలకు పాతర పెట్టారు. ఉద్యోగులను ఎవరూ ఆదుకోవడం లేదని మధన పడుతున్నారు. ప్రజల పక్షాన నిలిచేందుకు బండి సంజయ్ జాగరణకు పిలుపునిచ్చారు. సీపీ వాటర్ క్యానన్లతో శత్రువుల మీద దాడి చేయడం…