టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ముందు కాంగ్రెస్ కుట్రలు ఓడిపోయాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కోటిరెడ్డికి పార్టీలకతీతంగా మద్దతు తెలిపి మెజార్టీ ఇచ్చి గెలిపించారన్నారు. తక్కువ ఓట్లు ఉన్న జిల్లాలో పోటీ చేసిన…
స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఊహించనంత మోజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతంరం ఆయన మాట్లాడారు…పోలింగ్ ప్రశాంతం గా జరుగుతుందన్నారు. ఇతర పార్టీల సభ్యులు కూడా టి.ఆర్.ఎస్ వైపే ఉన్నారన్నారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, పార్టీలకతీతంగా ఓటేసిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన నల్గొండ జిల్లా కేసీఆర్ పాలనలో ఎంత సస్యశ్యామలం అయిందో స్థానిక…
బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మట్లాడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ పెట్టిన ప్రెస్‌మీట్‌కు ప్రతిగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. బండికి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కు సోయిలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతులను మేము ప్రత్యామ్నాయ పంటల కోసం సిద్ధం చేస్తుంటే వరి కొంటారా.. లేదా వరి వేస్తే ఊరి అంటూ ప్రజలను రెచ్చగొట్టి పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు రైతులకు కేంద్రంలో ఉన్న బీజేపీ,…
పోడు భూముల సంరక్షణ విషయంలో అటవీ శాఖ అధికారులకు, అటవీ భూమిని కబ్జా చేసిన గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యదాద్రి జిల్లాలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోడు భూములలో కబ్జాలు లేని 2006 చట్టం ప్రకారం అర్హత కలిగిన వారికి పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. ఇక నుంచి అటవీ భూములను అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలనుసారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి…
నవంబర్ 15న వరంగల్‌లో తలపెట్టిన మహాగర్జన సభకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంతో పాటు ఇవ్వని హామీలను కూడా పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు నిందించడమే పరమావధిగా పెట్టుకున్నాయని, ప్రతిపక్ష పార్టీలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వాలు తొందరగా పూర్తి చేసుకున్న…
యాసంగి పంటను కొనే దమ్ము బీజేపీకి ఉందా ఉంటే ఎన్ని లక్షల టన్నుల కొంటారో తేల్చి చెప్పాలని, ఆ మాట చెప్పకుండా బీజేపీ డ్రామాలు ఆడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎఫ్‌సీఐ ఇచ్చిన లేఖ తమ దగ్గరుందని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత యుత ప్రభుత్వం అని అన్నారు. అన్ని లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు. వానాకాలమే కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేసిందని దానిని మేము రాజకీయంగా వాడుకోలేదని మంత్రి తెలిపారు. ప్రజల…
తెలంగాణలో విద్యుత్ సంక్షోభం పై వస్తున్న వార్తలు అర్థ రహితం ఎన్టీవీతో మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం కూడా తెలంగాణలో పవర్ కట్ అవదు. రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు తెలంగాణ లో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీనిపై దేశాన్ని పాలిస్తున్న నేతలు సమాధానం చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ హైదరాబాద్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసాం అని చెప్పిన…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర అని చెప్పి… ప్రజలను మోసం చేసే యాత్రకు శ్రీకారం చుట్టారు అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామని యాత్రలో చెప్పి ఉంటే బాగుండేది. మోదీ పాలనలో ఈ దేశంకు ఏం చేశారు… 5 కోట్ల మందికి జాబ్ లు ఇస్తామన్నారు …ఏమైనది అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ అని…
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోనే భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి పైలాన్ ను కూడా ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు సురక్షిత నది జలాలు వచ్చాయని….ఇది టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనత అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించారని..ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత అని కొనియాడారు. ఇంటింటికి సురక్షిత నది…
ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం మరింత ముదురుతూనే ఉంది.. తాజాగా, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించగా.. ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదన్న ఆయన.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు.. ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్న ఆయన..…