హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఐటీ కార్యాలయం నుంచి సిబ్బంది 40 కార్లు, 3 సీఆర్పీఎఫ్ బస్సుల్లో బయలుదేరారు. ప్రస్తుతం ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
బెంగళూరులో ఆదాయపు పన్ను అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై నగరంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు కొనసాగాయి. మొత్తం 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్ చేశారు. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఛార్డెట్ అకౌంటెంట్ల నివాసాల్లో తనిఖీలు జరిగాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప సన్నిహితుడు…