రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించారు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్.. ఎన్నో ప్రాజెక్టులను, కొత్త సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టేలా చేశారు.. ఇక, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయల్దేరింది.. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్ టీమ్.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి…