Astronauts Capture Shimmering Aurora Lights From Space: ఇటీవల కాలంలో సూర్యుడి వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. సూర్యుడు మధ్య వయస్సుకు చేరుకోవడంతో సూర్యుడిపై భారీగా బ్లాక్ స్పాట్స్, సౌర జ్వాలలు, సౌరతుఫానులు సంభవిస్తున్నాయి. ఇందులో కొన్ని నేరుగా భూమి వైపు వస్తున్నాయి. అత్యంత ఆవేశపూరిత కణాలతో కూడిన సౌర తుఫానులు భూమిని తాకుతుంటాయి. అయితే భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం సౌరతుఫానులు భూమిపై పెద్దగా ప్రభావం చూపించలేవు. భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం ఈ తుఫానుల…
Russia-ISS: కొన్నేళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి రష్యా, అమెరికా. అయితే 2024 తరువాత తాము ఐఎస్ఎస్ నుంచి వైదొలుగుతున్నామని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చత్య దేశాలు విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన స్పేస్ X సంస్థ అంతరిక్ష యాత్రలో మరో ఘనత సాధించింది. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోకి స్పేస్ X సంస్థ నలుగురు వ్యోమగాములను పంపింది. వీరు 10రోజుల పాటు ఆ కేంద్రంలో గడపనున్నారు. ఐఎస్ఎస్‌కు పయనమైన మొట్టమొదటి ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్ ఇదే. దిగువ భూ కక్ష్యలో వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రల రంగంలో ఇదో మైలురాయి అని నాసా అభివర్ణించింది. అయితే స్పేస్ X సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు చెందినది…
అంతరిక్షంలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి, ఇతర గ్రహాల స్థితిగతులను అంచనా వేసేందుకు స్పేస్‌లో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంతరిక్ష కేంద్రంలో సభ్యదేశాలకు చెందిన పరిశోధకులు రోటేషన్ పద్ధతిలో పనిచేస్తుంటారు. వ్యోమగాములు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి మారుతుంటారు. అయితే, అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన మనిషి భారరహిత స్థితికి చేరుకుంటారు. Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్: మాస్క్ అప్‌గ్రేడ్… ఆ సమయంలో తప్పని సరిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. అందుకే ప్రతిరోజూ క్రమం…
కొన్ని ప్రయాణాలు చాలా ఖరీదైనవి. అలాంటి ప్రయాణాల్లో ఇదికూడా ఒకటిగా చెప్పవచ్చు. అంతరిక్ష రంగంలో అనేక ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా రాకెట్లు, స్టార్‌షిప్ వంటి వాటిని తయారు చేస్తున్నారు. అంతరిక్ష రంగం కమర్షియల్‌గా లాభసాటిగా మారింది. ప్రపంచ కుబేరులు అంతరిక్షంలో ప్రయాణం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి వారిలో జపాన్‌కు చెందిన మెజువా కూడా ఒకరు. Read: ఒమిక్రాన్ దెబ్బకు మరో అంతర్జాతీయ సమావేశం వాయిదా… మెజువా డిసెంబర్ 8…
ఇంటర్నెట్ ప్రపంచంలో ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇంట్లో వంటలు వండుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. యూప్ ఒపెన్ చేసి కావాల్సినవి తెప్పించుకొని తింటున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఫుడ్ పాయింట్స్ నుంచి 10 లేదంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వారికి డెలివరీ బాయ్స్ ఫుడ్‌ను డెలివరి చేస్తుంటారు. 248 మైళ్ల దూరంలో ఉండే వారికి ఫుడ్ డెలివరి చేయమంటే చేస్తారా? భూమిపై కాకుండా ఆకాశంలో 248 మైళ్ల దూరంలో ఉన్న వారికి…
సాధారణంగా అంతరిక్షంలో జరిగే సన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రత్యేకమైన సెట్స్ వేసి లేదంటే గ్రాఫిక్స్‌లోనూ షూట్ చేస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన చిత్రబృందం ఏకంగా స్పేస్‌లోనే డైరెక్ట్‌గా సినిమాను షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ది ఛాలెంజ్ అనే సినిమాలోని 40 నిమిషాల సీన్ కోసం 12 రోజులపాటు అంతరిక్షంలో షూటింగ్ చేయబోతున్నారు. మంగళవారం రోజున ఈ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ లు రష్యాలోని బైకనూర్ నుంచి సోయిజ్ ఎంఎస్ 19…
ప్రపంచంలో ఎక్కువ మంది పిజ్జాలు తింటుంటారు. ప్రతిరోజూ కోట్లాది పిజ్జాలను ప్రజలు ఆర్డర్ చేస్తుంటారు. భూమి మీద ఎలా ఉన్నా, అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే, అక్కడ వారు వీలైనంత తక్కువగా ఆహారం తీసుకోవాలి. భారరహిత స్థితిలో ఉంటారు. పైగా అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నింటిని పక్కన పెట్టి భూమిపై ఉంటే ఎలాగైతే పార్టీ చేసుకుంటారో అదే విధంగా అంతరిక్ష కేంద్రంలో కూడా పిజ్జా పార్టీ…
ప్రతి ఏడాది నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్స్ గేమ్స్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్స్‌లో పాల్గొని పతకం సాధించాలని క్రీడాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. కరోనా సమయంలో సవాళ్లను ఎదుర్కొని జపాన్ టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. 17 రోజులపాటు సాగిన ఈ గేమ్స్‌లో 200 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భూమిపై టోక్యోలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహిస్తే, స్పేస్‌లో వ్యోమగాములు స్పేస్ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. వ్యోమగాములు రెండు జట్లుగా…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు పెను ప్రమాదం తప్పింది. రష్యాకు చెందిన వ్యోమనౌక రీసెర్చ్ మాడ్యూల్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాక ఐఎస్ఎస్ తో డాక్ చేశారు. డాక్ చేసిన కొన్ని నిమిషాల తరువాత హతాత్తుగా మాడ్యూల్‌కి చెందిన థ్రస్టర్స్ ఫైర్ అయ్యాయి. దీంతో అంతరిక్ష కేంద్రం కొంతమేర అదుపుతప్పింది. వెంటనే రంగంలోకి దిగిన నాసా శాస్త్రవేత్తలు లోపాన్ని సవరించారు. దీంతో అంతరిక్ష కేంద్రం తిరిగి యధాస్థితికి వచ్చింది. డాక్ చేసిన తరువాత కంప్యూర్స్‌లో అప్‌డేట్ కాకపోవడంతో…