ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం.. ఇంకోవైపు ప్రత్యక్షంగా ఇరాన్‌కు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు. అంతేకాకుండా ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రం అని కూడా తెలుసు. అంతేకాకుండా చైనాకు పాకిస్థాన్ మిత్ర దేశం. ఇన్ని పరిణామాల మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Iran Attacks Israel: ఇరాన్ అణు కార్యక్రమాలే టార్గెట్‌గా శుక్రవారం నుంచి ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ అణు ఫెసిలిటీలు, అణు శాస్త్రవేత్తలు, మిలిటరీ టాప్ జనరల్స్‌ని టార్గెట్ చేసి చంపేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ‘‘ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3’’ పేరుతో ఇజ్రాయిల్ పైకి క్షిపణి దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌కి ఉన్న బలమైన ఎయిర్ డిఫెన్స్ ఇన్కమింగ్…
Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ యుద్ధం మూలంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతుందని అన్ని దేశాలు భయపడుతున్నాయి. మరోవైపు, శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య ఘర్షణ ఆరో రోజుకు చేరింది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు చేసింది.
మొహసిన్ ఫక్రిజాదే.. ఇరాన్ అణు పితామహుడు. ఇరాన్ అణు ఆశయాల వెనుక ఉన్నది ఇతడే. కానీ ఇతన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఎలా లక్ష్యంగా చేసుకుందో.. ఏమో తెలియదు గానీ.. అత్యంత రహస్యంగా టెహ్రాన్‌లో 2020లో గురి చేసి కాల్చి చంపేసింది.
Iran-Israel : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. విద్య, ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన వారిపై ప్రభావం పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణానికి చెందిన 57ఏళ్ల రెవెళ్ల రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మరిన్ని దేశాలకు పాకే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండగా.. ఇప్పుడు మూడో దేశం అమెరికా కూడా తోడవుతోంది. ఇరాన్‌పై యుద్ధానికి రంగంలోకి దిగుతోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఇరు పక్షాలు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీ స్థాయిలో జరుగుతోంది. అణు ఉత్పత్తిని నిలిపివేసేంత వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది.
Israel Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఘర్షణ తీవ్రమవుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో పాటు, ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్‌ని హతమార్చింది.
ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు జరుగుతుండగా.. ఇంకోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా వార్ ఉధృతం అవుతోంది. తాజాగా కీవ్‌పై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. బహుళ అంతస్థుపై డ్రోన్‌ను ప్రయోగించగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి.