Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ లో జరిగిన క్రూరమైన హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బలగాలు వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే భూతల దాడులు నిర్వహించేందుకు సైన్యం సిద్ధమైంది. పాలస్తీనా ప్రజలు గాజా ఉత్తర ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఇప్పటికే ఐడీఎఫ్ హెచ్చరించింది.