Israel-Palestine conflict: ధైర్యం ఎలాంటి ప్రమాదాన్నైనా జయిస్తుంది. శత్రువుల్ని ఎదుర్కోగలం అనుకున్నప్పుడు శక్తిని, పరిస్థితి ప్రమాదకరం అని తెలిసినప్పుడు యుక్తిని ఉపయోగిస్తే మరణాన్నైనా జయించవచ్చు అనడానికి ఈ యువకుడే ఉదాహరణ.. వివరాలలోకి వెళ్తే దక్షిణ ఇజ్రాయెల్‌లో, గాజా సరిహద్దుకు సమీపంలో, హమాస్ చేసిన ఆకస్మిక దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు. కాగా చివరి నిమిషంలో ఓ కుటుంబానికి బ్రతికేందుకు ఓ చిన్న ఆశ్రయం లభించింది. ఈ నేపథ్యంలో వారాంతంలో అతను హమాస్ ఫైటర్స్ దాడి నుండి…
Israel Hamas War: హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది.
Israel: కార్లపై పరుపులు, పిల్లల్ని పట్టుకుని తల్లితండ్రులు బతుకజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. హమాస్ ఉగ్రవాదుల దాడి, పాలస్తీనాలోని గాజా ప్రాంతంలోని ప్రజలకు శాపంగా మారాయి. కేవలం 24 గంటల్లో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ప్రజలు అక్కడి నుంచి దక్షిణం వైపు కదిలివెళ్తున్నారు. కార్లపై బట్ట
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మొదలై 7 రోజులు గడిచాయి. గత శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్లతో విరుచుకుపడింది. కేవలం 20 నిమిషాల్లోలనే 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇంతే కాకుండా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి దొరికినవాళ్లను దొరికినట్లు కాల్చి చంపారు. వందల మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే హమాస్ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజలు మరణించారు.
Operation Ajay: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో అనేక దేశాల పౌరులు కూడా మరణించారు. వీటన్నింటి మధ్య, ఇజ్రాయెల్ నుండి తన పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది.
Israel: ఇజ్రాయిల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు పలువురు ఇజ్రాయిల్ పౌరులను, ఇతర దేశస్తులను బందీలుగా చేసుకున్నారు. ఇదిలా ఉంటే వీరిని రక్షించేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతున్నట్లు బ్రిటీష్ పత్రికి ది టెలిగ్రాఫ్ నివేదించింది. దాదాపుగా 100 మంది పౌరులు హమాస్ ఉగ్రవాదులు చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రపంచంలో అతిశక్తివంతమైన, ఇజ్రాయిల్ ప్రత్యేక ఆపరేషన్స్ దళం సయెరెట్ మత్కల్ సిద్ధమైనట్లు సమాచారం.
Israel Hamas War: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది గాజాపై పూర్తి దిగ్బంధనం విధించబోతున్నట్లు ఇజ్రాయెల్ సోమవారం తెలిపింది. ఆ ప్రాంతానికి నీరు, ఆహారం, ఇంధనాన్ని అనుమతించడంపై నిషేధం విధించినట్లు తెలిసింది.
గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా చొరబడిన తరువాత దక్షిణాన ఉన్న భూభాగాలపై తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ మేరకు సీఎన్ఎన్ సోమవారం నివేదించింది. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు.