గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా చొరబడిన తరువాత దక్షిణాన ఉన్న భూభాగాలపై తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ మేరకు సీఎన్‌ఎన్ సోమవారం నివేదించింది. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు.
Israel-Palestine War: హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతోంది. శనివారం ఉదయం, హమాస్ అనేక ఇజ్రాయెల్ లక్ష్యాలపై 7000 కంటే ఎక్కువ రాకెట్లను ప్రయోగించింది.
Israel: పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై మెరుపుదాడి చేశారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లతో ఇజ్రాయిల్ భూభాగాలపై దాడులు నిర్వహించారు. సరిహద్దుల్లోనే పట్టణాలను టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగాల్లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరులను పిట్టల్లా కాల్చారు.