Air India: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకునేలా చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య చేయబడటంపై ఇరాన్ రగిలిపోతోంది.
Air India: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని టెహ్రాన్‌లో హత్య చేయడం, ఈ హత్యలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల్ని ఇజ్రాయిల్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
శనివారం అర్ధరాత్రి ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయెల్‌పై వేగవంతమైన వైమానిక దాడులను ప్రారంభించినప్పుడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరాన్ 300 కంటే ఎక్కువ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని, వాయు రక్షణ వ్యవస్థ ద్వారా దాదాపు అన్నింటినీ నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
Iran: సిరియాలో దాడి చేసిన తర్వాత ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తోందో అని ఇజ్రాయిల్ భయపడుతోందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు యాహ్యా రహీమ్ సఫానీ అన్నారు. జియోనిస్ట్(ఇజ్రాయిల్)పూర్తి భయాందోళనతో, అప్రమత్తంగా ఉన్నారని ఆయన శనివారం వ్యాఖ్యానించారు.