Israeli Operation: ఇజ్రాయిల్ ఇరాన్‌ని తన అస్తిత్వానికి ముప్పుగా చూస్తోంది. ఇరాన్ చేతికి న్యూక్లియర్ ఆయుధాలు రావద్దనేది ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ మీద విరుచుకుపడుతోంది. ముఖ్యంగా, ఇరాన్ అణు కార్యక్రమాలపై, వారి సైంటిస్టులను టార్గెట్ చేసి దాడులు చేసింది. 2005 నుంచి ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం, ఇరాన్ అణ్వాస్త్రాలకు అవసరమయ్యే యూరేనియాన్ని శుద్ధి చేసినట్లు అనుమానిస్తున్న ఇజ్రాయిల్, భారీ దాడులు చేసింది.
Iran: ఎప్పుడైతే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసిందో అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో నిత్యం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా ఇరాన్, హమాస్, హిజ్బుల్లా కలిసి పనిచేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్‌కి భారీ హెచ్చరికలు చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయిల్‌ని నాశనం చేస్తామని ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) జనరల్ ఇబ్రహీం జబ్బారి నుండి తాజా హెచ్చరికలు వచ్చాయి.
Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ ఈ రోజు వైమానిక దాడులు చేసింది. నిర్ధిష్ట లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు సైనికులు చనిపోయినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. అక్టోబర్ 01న ఇరాన్, ఇజ్రాయిల్‌పై 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఈ రోజు ఇజ్రాయిల్, ఇరాన్‌పై విరుచుకుపడింది. అయితే, ఈ దాడిని సిరియా, సౌదీ అరేబియా…
Israel Hezbollah: హమాస్ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మట్టుపెట్టడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం తీవ్రతరం చేస్తున్నట్లు హెజ్‌బొల్లా గ్రూప్ వెల్లడించింది.
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమువుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ ప్రాక్సీలైన హిజ్బుల్లా, హమాస్‌లను హతం చేస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా కీలక నాయకుడు హసన్ నస్రల్లాని చంపేసింది, ఆ తర్వాత హిజ్బుల్లా చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న హసీమ్ సఫీద్దీన్‌ని కూడా చంపేసింది. హిజ్బుల్లా ప్రధాన కమాండర్లని చంపేసింది. ఇదిలా ఉంటే, హజ్బుల్లాపై దాడికి ప్రతిస్పందనగా, ఇటీవల ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగింది.
హిజ్బుల్లా, ఇరాన్‌తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్‌కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఇప్పుడు హిజ్బుల్లా టార్గెట్‌గా లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేస్తోంది. శత్రువులతో చేతులు కలిపే దేశాలపై ఇజ్రాయెల్ దూకుడుగా పోతోంది. ఇప్పటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆయా దేశాలు తమ పౌరులు లెబనాన్‌ను విడిచిపెట్టాలని ఆదేశాలు ఇచ్చాయి.
Ismail Haniyeh: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని గుర్తుతెలియని వ్యక్తులు ఇరాన్ టెహ్రాన్ నగరంలో కాల్చి చంపారు. ఈ హత్యపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. తన ప్రాధేశిక సమగ్రతను, గౌరవాన్ని కాపాడుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.