Yahya Sinwar: ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మిలిటెంట్ గ్రూప్ చీఫ్, 2023 అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మట్టుబెట్టింది. కాగా, చనిపోయే ముందు సిన్వర్ యొక్క చివరి కదలికలకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి.
హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
హమాస్ మిలిటెంట్ల స్థావరాలున్న గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడుల్లో దారుణం జరిగింది. ఈ దాడుల్లో 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని హమాస్ మిలిటరీ ప్రకటించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సరి కొత్త ప్రతిపాదనలను రూపొందించారు. ఇందులో కాల్పుల విరమణ, హమాస్ చేతిలో ఉన్న బందీల విడుదల గురించి కూడా ఉన్నాయి.
రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం బాధకరం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో దాడి చేసి తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటించారు.
రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
భారత్- బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగింటిపై దాడులు జరిగినట్లు అనేక కథనాలు వస్తున్నాయి. వీటిల్లో భారత్- ఐరోపా మధ్య సేవలు అందించేవి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.