అగ్నిప్రమాదాలు పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా ఇరాక్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు ఇరాక్‌లోని అల్-కుట్ నగరంలోని హైపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 మంది మరణించారు. భవనంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్-కుట్ నగరంలోని ఐదు అంతస్తుల భవనంలో రాత్రిపూట మంటలు చెలరేగాయి. మంటలు చాలా దూరం వరకు వ్యాపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు ప్రాథమిక ఫలితాలను 48 గంటల్లో ప్రకటిస్తామని అల్-కుట్ గవర్నర్ చెప్పారని వార్తా సంస్థ INA నివేదించింది.