ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. క్షిపణుల ప్రయోగాలతో ఇరు దేశాల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని నగర నివాసితులంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది.