గత కొన్ని రోజులుగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంలో భజ గోవిందం పదాన్ని ఎరోటిక్ సీన్స్ నేపథ్యంలో వాడారని, దాన్ని వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్స్ లోనూ కేసులు పెట్టారు. దాంతో దర్శకుడు యుగంధర్ తన ప్రమేయం లేకుండా ఆ పదం పొరపాటున ట్రైలర్ లో చేరిందని బేషరతుగా…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అనే సందిగ్థంలో పెద్ద సినిమా నిర్మాతలు మీనమేషాలు లెక్కపెడుతుంటే, చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం… ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నట్టుగా థియేటర్ల బాట పట్టారు. అలా శుక్రవారం జనం ముందుకు వచ్చిన చిత్రమే ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. మరో విశేషమేమంటే… ఈ మూవీలోని ట్రైలర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ, విడుదలకు ముందే వివాదం చెలరేగింది. దాంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకుని దర్శకుడు వై.…
“ఇప్పుడు కాక ఇంకెప్పుడు” సినిమా యూనిట్‌పై వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. వెంకన్నను కీర్తించే భజగోవిందం కీర్తనతో బెడ్‌రూమ్ సన్నివేశాలను అసభ్యకరంగా చిత్రీకరించారని బీజేపీ, వీహెచ్‌పీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మూవీ ట్రైలర్ కూడా అసభ్యకరంగా ఉందని కంప్లైంట్‌లో తెలిపారు. అయితే దీనిపై తాజాగా ఈ చిత్ర దర్శకుడు యుగంధర్ వీడియో ద్వారా స్పందించారు. ‘ఇది కావాలని చేసింది కాదని, తన పాత సినిమాలోని…
‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సుమోటో కేసు నమోదు అయింది. సినిమా ట్రైలర్ లోని ఓ సన్నివేశంలో హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆన్లైన్ లో ఫిర్యాదు మేరకు 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలోనూ అభ్యంతకర పోస్టులు వెలువడ్డాయి. సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.…
గత శుక్రవారం అంటే జూలై 30న ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘తిమ్మరుసు’కు మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్లను పుల్ చేసేంత మాస్ అప్పీల్ హీరో సత్యదేవ్ కు లేకపోవడంతో కలెక్షన్లు ఓ మాదిరిగానే ఉన్నాయి. అలానే ఈ సినిమాతో పాటు విడుదలైన ‘ఇష్క్’కు నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో ఎవరూ ఆ మూవీ గురించి చర్చించడం లేదు. ఇక ఈ రెండు సినిమాతో పాటు వచ్చిన మరో మూడు సినిమాల గురించి కూడా జనాలు…
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ లభిస్తోంది. ఇదే బాటలో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ కథతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన చిత్రం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. ఇందులో హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. తనికెళ్ల భరణి కీలకపాత్రను పోషించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా చింతా…