ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ లభిస్తోంది. ఇదే బాటలో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ కథతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన చిత్రం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. ఇందులో హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. తనికెళ్ల భరణి కీలకపాత్రను పోషించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) ఈ సినిమాను నిర్మించారు. వై. యుగంధర్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కి, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమాను ఈ నెల 30న విడుదల చేస్తున్నామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.