“ఇప్పుడు కాక ఇంకెప్పుడు” సినిమా యూనిట్‌పై వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. వెంకన్నను కీర్తించే భజగోవిందం కీర్తనతో బెడ్‌రూమ్ సన్నివేశాలను అసభ్యకరంగా చిత్రీకరించారని బీజేపీ, వీహెచ్‌పీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మూవీ ట్రైలర్ కూడా అసభ్యకరంగా ఉందని కంప్లైంట్‌లో తెలిపారు. అయితే దీనిపై తాజాగా ఈ చిత్ర దర్శకుడు యుగంధర్ వీడియో ద్వారా స్పందించారు. ‘ఇది కావాలని చేసింది కాదని, తన పాత సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఈ ట్రైలర్ లో పెట్టుకోవటం వల్ల అది రాంగ్ ప్లేస్ లో భజగోవిందం అనే పార్టు ప్లే అయిందని చెప్పుకొచ్చాడు. అది నేను గమనించలేకపోయాను, అది పొరపాటే.. క్షమించమని అడుగుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమా ఆగస్టు 6న విడుదల కానుంది.