సంజూకు సంబంధించి మరో ప్రచారం తాజాగా మొదలైంది. వచ్చే సీజన్‌లో కేకేఆర్‌కు శాంసన్ ఆడబోతున్నాడని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రచారానికి కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్ హింట్ ఇచ్చాడు. తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్లో చేసిన ఓ పోస్ట్‌లో సంజూతో చాలాకాలం క్రితం కలిసి దిగిన ఫోటో దర్శనమిస్తుంది. ఈ ఫోటోకు బిజూ కొన్ని జ్ఞాపకాలు ప్రత్యేకమైనవిగా ఉండిపోతాయని క్యాప్షన్ ఇచ్చాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగుళూరు వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాన్స్ కోల్పోయిన చెన్నై.. పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానానికి చేరుకుంది. 10 మ్యాచులు ఆడి కేవలం 2 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నై, ఆర్సీబీ కలిసి ఆడే చివరి మ్యాచ్ ఇది.. 10 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 7 మ్యాచుల్లో…
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. ధోనీ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలకు మాత్రం ఫుల్‌స్టాప్ ఉండదు. అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా సులభంగానే వీడ్కోలు పలికేసిన ధోనీ ఐపీఎల్ కు మాత్రం అంత త్వరగా దూరం కాలేకపోతున్నాడు. వయసు 43 దాటేసినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాడు. ధోనీకిదే చివరి సీజన్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. ధోనీ…