ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై తొలి మ్యాచ్‌లో విజయ కేతనం ఎగుర వేసింది. గత 12 సంవత్సరాలుగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగించింది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ సేన 155 పరుగులు సాధించింది. సీఎస్‌కే విజయానికి 156 పరుగులు అవసరం. తిలక్ వర్మ 31 పరుగులు చేయగా.. కెప్టెన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట ముంబై బ్యాటింగ్ చేయనుంది. కాగా.. హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ రితురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్‌కే జట్టు కొత్త ఉత్సాహంతో ప్రవేశిస్తుంది. రెండు…
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 18వ సీజన్‌లో భాగంగా నేడు రెండు టీంలు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా.. అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు కూడా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. గత 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లో గెలవకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ముంబై ఇండియన్స్ ముందుకెళ్తోంది.…
మరి కొన్ని నిమిషాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఘనంగా ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ జరగడం ఇది రెండోసారి. టోర్నమెంట్ మొదటి సీజన్ 2008లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పుడు కేకేఆర్ భారీ తేడాతో గెలిచింది. 2008 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ కేకేఆర్ తరఫున 158 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం 7.30 గం.కు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రారంభ మ్యాచ్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.