ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. మెగా వేలంలో 10 జట్లు రూ.639.15 కోట్లు వెచ్చించి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఈసారి మెగా వేలంలో ఆర్సీబీ19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజాగా ఆర్‌సీబీ ఐపీఎల్ కి ముందే ఓ వివాదంలో చిక్కుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై ఇటీవల బీసీసీఐ స్పష్టతను ఇచ్చింది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను అన్ని ప్రాంఛైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ మూడో వారంలో వేలం జరిగే అవకాశం ఉంది. వేలం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌గా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మను తీసుకుని సారథిగా నియమిస్తారని నెట్టింట చర్చ మొదలైంది. అయితే ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటెన్షన్ చేసుకుని.. సారథ్య బాధ్యతలను…
RCB IPL 2025 Retained Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి సంబంధించి మెగా వేలం వచ్చే నవంబర్‌లో ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అన్ని ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌పై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆర్‌సీబీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు కానీ..…