ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా దళాలు ఇప్పటికే ప్రవేశించాయి. రెండు దేశాల సైనికుల మధ్య యుద్ధం బీకరస్థాయిలో జరుగుతున్నది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఈ దాడులకు భయపడి సామాన్యప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బంకర్లలో తల దాచుకుంటున్నారు. ఇలాంటి ఉక్రెయిన్ మరుభూమిగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఎవరికి పెళ్లి అనే ఆలోచన రాదు. పెళ్లి కంటే బతికి ఉండటమే మేలు అనుకుంటారు. Read: Ukraine –…
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. 75 వేల మంది బలగాలను రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. కాగా, ఇప్పుడు అమెరికా బాటలోనే జర్మనీ కూడా హెచ్చరించింది. జర్మనీ కొత్త ఛాన్సలర్ స్కాల్జ్ కూడా రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పై ఎలాంటి యుద్ద చర్యలకు పాల్పడినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని, రష్యా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని…
దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలపై ఆధిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పటినుంచో తైవాన్‌పై కన్నేసిన చైనా ఇప్పుడు ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తరచుగా చైనా యుద్ధ విమానాలు తైవాన్ బోర్డర్ వరకు వెళ్లి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం 30 యుద్దవిమానాలు తైవాన్ బొర్డర్‌లో ఎగురుతూ కనిపించాయి. కాగా, తాజాగా 52 యుద్ధవిమానాలు తైవాన్ సరిహద్దులు దాటి లోనికి ప్రవేశించినట్టు తైవాన్ రక్షణశాఖ మంత్రి తెలిపారు.…