ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలు, టారిఫ్స్ వంటి వాటిపై షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నారు. ఇప్పుడు విదేశీ విద్యా్ర్థులపై ఆంక్షలకు తెరలేపారు. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే కాంక్ష ఉన్నవారికి బిగ్ షాక్ తగిలినట్లే. ట్రంప్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఒక మెమో పంపింది. అవి సమాఖ్య నిధులను కొనసాగించాలనుకుంటే కఠినమైన కొత్త షరతులను పాటించాలని కోరింది. ఈ విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై…
Australia: ఆస్ట్రేలియాలో ఒక భారతీయులు దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్నారు. కొందరు దుండగులు అతడిని దుర్భాషలాడుతూ, తీవ్రంగా దాడి చేశారు. గత వారం దక్షిణ ఆస్ట్రేలియన్ నగరమైన అడిలైడ్‌లో ఓ కార్ పార్కింగ్ వివాదంలో, గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. కింటోర్ అవెన్యూలో శనివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
Canada: కెనడియన్ ఫెడరల్ సర్కార్ విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఇంటర్ నేషనల్ స్టూడెంట్స్ ను మరింత తగ్గిస్తున్నట్లు పేర్కొనింది. తాత్కాలిక నివాసితుల రాకపోకల పరిమితి నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
Housing Crisis: కెనడాలో హౌసింగ్ క్రైసిస్ తీవ్రమవుతోంది. అక్కడ ప్రజలు ఇళ్లు దొరక్క తెగ ఇబ్బందుల పడుతున్నారు. కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగం, గృహ సంక్షోభంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై అక్కడి ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు శనివారం వెల్లడించారు. అయితే ఎంతమేర పరిమితి విధిస్తారనే వివరాలను మంత్రి పేర్కొనలేదు.